Vishwak Sen: ఈతరం యువ హీరోల్లో ఆ ఘనత నాకే దక్కింది: హీరో విష్వక్‌ సేన్‌

Among the young heroes of this generation I am the only one who has received that honor Hero Vishwak Sen

  • 'లైలా' విడుదల నేపథ్యంలో విలేకరులతో ముచ్చటించిన విష్వక్‌ సేన్‌ 
  •  'లైలా'  అందర్ని ఎంటర్‌టైన్‌ చేస్తుందని నమ్మకాన్ని వ్యక్త పరిచిన విష్వక్‌ సేన్‌ 
  • లేడి గెటప్‌ కోసం శ్రమించాని చెబుతోన్న విష్వక్‌ సేన్‌

విశ్వక్‌సేన్.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగిన యువ కథానాయకుల్లో ఒకరు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం 'లైలా'. ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్‌లో కూడా కనిపించబోతున్నారు. పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ విలేకరులతో ముచ్చటించారు.

ప్రత్యేకంగా లేడీ గెటప్ చేయాలని కోరిక మీకు ఉందా?
ప్రతి నటుడికి కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. గతంలో భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం సినిమాల్లో హీరోలను లేడీ గెటప్స్‌లో చూసినప్పుడు నాకు కూడా ఇలాంటి పాత్ర దొరికితే చేయాలని ఉండేది. అలాంటి కథ రావడం, అంతే కాకుండా ఆడియన్స్ కూడా రొటీన్ పాత్రలు వేస్తే చూడటం లేదు. ఇక ఈ తరం యంగ్ హీరోల్లో ఎవరూ కూడా అమ్మాయి పాత్రలో కనిపించలేదు. దాదాపుగా గత 20 ఏళ్లుగా ఎవ్వరూ కూడా అలాంటి పాత్ర చేయలేదు. ఆ లోటును నాతో తీర్చాను. తప్పకుండా నా లేడీ గెటప్ అందర్నీ అలరిస్తుంది. కడుపుబ్బా నవ్విస్తుంది.

ఈ చిత్రంలో మీరు సోను, మోడల్ లైలా రెండు పాత్రలు చేశారు? ఈ రెండింటిలో మీకు ఇష్టమైన పాత్ర ఏది?
అందులో సందేహం ఏమీ లేదు. లైలా పాత్రను చాలా ఇష్టపడి చేశాను. రేపు మీరు కూడా లైలా ప్రేమలో పడతారు. సినిమా చూస్తున్నప్పుడు సోను పాత్రను కూడా ఇష్టపడతారు. సినిమా ఫస్ట్‌హాఫ్‌లో సోను ఆధునిక లైఫ్‌ని, అతని లైఫ్‌స్టైల్‌ని అందరూ ఆస్వాదిస్తారు.

సినిమాలో సోను, లైలాగా ఎందుకు మారాల్సి వస్తుంది? అసలు లైలా టార్గెట్ ఏమిటి?
అది సినిమాలో చూస్తేనే కిక్ ఉంటుంది. సోను జీవితంలో జరిగిన మూడు సమస్యల నుంచి బయటపడటానికి లైలాగా మారుతాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేది తెరపై చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది.

లేడీ గెటప్ వేయడానికి ఎలాంటి హోంవర్క్ చేశారు?
సెట్‌లో ఆ గెటప్‌లోకి మారడానికి, మేకప్‌కి రెండున్నర గంటలు సమయం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎంతో ఓపికగా ఎక్కడా రాజీ పడకుండా పూర్తిగా రూపం మారే వరకు కాంప్రమైజ్ కాడు. నా గెటప్ కూడా ఎంతో నేచురల్‌గా ఉందనే ప్రశంసలు లభించాయి.

సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ట్రైలర్‌లో ఎక్కువ అడల్ట్ సీన్స్ కనిపిస్తున్నాయి?
అది అడల్ట్ కంటెంట్ కాదు.. అడల్ట్ సీన్స్ అంతకన్నా కాదు. ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఫన్ కంటెంట్. అందరూ కడుపుబ్బా నవ్వుకుంటారు. అంతే తప్ప ఎక్కడా కూడా అసభ్యతగా ఉండదు.

ప్రెస్ మీట్‌లో మీరు కాంపౌండ్ అనే ప్రశ్న విషయంలో ఇచ్చిన సమాధానం చిరంజీవి గారికి నచ్చడం, ఆయన ప్రీరిలీజ్ వేడుకలో దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎలా అనిపించింది?
నాకు ఆయన నా సమాధానాన్ని గురించి ప్రస్తావించడం ఆసక్తిగా అనిపించింది. నా సమాధానంతో ఆ టాపిక్ క్లోజ్ అయిందని అనుకున్నాను. కానీ చిరంజీవి నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని ప్రస్తావించడం చాలా ఆనందంగా అనిపించింది.

లైలాకు మీరు పాటలు కూడా రాశారు? ఎందుకంత ఆసక్తి?
నాకు రాయడం ఇంట్రెస్ట్. అందుకే రాశాను. బాగుంటే పెట్టుకోండి.. లేకపోతే వద్దు అని చెప్పాను. కానీ దర్శకుడికి నచ్చడంతో పెట్టుకున్నారు.

మొదట్లో ఈ లైలా గెటప్‌లో మీ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంది?
వాళ్లు నాతో ఆడుకున్నారు.. సెటైర్స్ వేశారు. మా అత్తమ్మ, అమ్మలు నాకు మ్యాచ్ అయ్యే చీరలు కూడా కట్టుకుని నా ముందుకు వచ్చారు.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎలా అనిపించింది?
ఎంతో హ్యాపీగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంది. ముందు రోజు వరకు ల్యాండింగ్‌కు అనుమతి రాలేదు. అయితే ఆ స్వామి కృపతో మిడ్‌నైట్ ల్యాండింగ్‌కు క్లియరెన్స్ వచ్చింది. ఆ స్వామియే నన్ను అక్కడికి పిలుపించుకున్నాడని అనిపించింది.

ఇప్పటి వరకు లైలాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్?

చిరంజీవి గారు ప్రీరిలీజ్ వేడుకలో స్టేజ్ మీద 'నాకే కొరకాలనిపిస్తుందని' చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తిండిపోయే సినిమా అవుతుందనే నమ్మకంతో చేశాను. 

  • Loading...

More Telugu News