Telangana: కేంద్రమంత్రి షెకావత్‌కు తెలంగాణ బీజేపీ ఎంపీల విజ్ఞప్తి

T BJP MPs meets Union Minister Shekhawat

  • కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసిన ఎంపీలు డి.కె. అరుణ, రఘునందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి
  • దేశంలో 12 కోట్ల బంజారాలు ఉన్నారన్న బీజేపీ ఎంపీలు
  • కేంద్రం అధికారికంగా జయంతిని నిర్వహించాలని విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా 12 కోట్ల బంజారాలు ఉన్నారని, బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలు డి.కె. అరుణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలన్నారు.

అవసరమైతే ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా జయంతిని నిర్వహించాలని కోరారు. ఈ నెల 15న సంత్ సేవాలాల్ జయంతి ఉందని, ఈ లోపు వీలుకాకపోతే వచ్చే ఏడాదికైనా అధికారికంగా నిర్వహించేలా చూడాలని కోరారు.

  • Loading...

More Telugu News