Sake Sailajanath: జగన్, షర్మిల వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నా: శైలజానాథ్

- వైఎస్ కుటుంబంపై తనకు ఆరాధనా భావం ఉందన్న శైలజానాథ్
- శాంతిభద్రతల బాధ్యత పవన్ తీసుకోవాలని సూచన
- యాత్రల పేరుతో తప్పించుకోవద్దని వ్యాఖ్య
ఎన్టీయే ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వాటిని ఎదిరించేందుకు తాను వైసీపీలో చేరానని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. తనను సాదరంగా, ప్రేమ పూర్వకంగా పార్టీలోకి ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా తనకు ఆరాధనా భావం ఉందని చెప్పారు. జగన్, షర్మిల మధ్య జరుగుతున్న వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలను చూసి ఎన్డీయేకి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చారని... ఆ హామీలను అమలు చేయలేమననే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని... శాంతిభద్రతల బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ తీసుకోవాలని... యాత్రల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని అన్నారు.