Varudu Kalyani: లక్ష్మికి అన్యాయం జరిగితే పవన్ ఏం చేశారు?: వరుదు కల్యాణి

- మహిళలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని పవన్ చెప్పారన్న కల్యాణి
- కిరణ్ రాయల్ తాట ఎందుకు తీయలేదని ప్రశ్న
- మహిళా రక్షణ కోసం చంద్రబాబు సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శ
రాష్ట్రంలో మహిళలకు అన్యాయం చేసే వాళ్ల తాట తీస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారని... లక్ష్మి అనే మహిళను వేధించిన జనసేన నేత కిరణ్ రాయల్ తాట ఎందుకు తీయలేదని వైసీపీ నాయకురాలు వరుదు కల్యాణి ప్రశ్నించారు. లక్ష్మికి అన్యాయం జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి రోజు మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు మానాలు పణంగా పెడితేనే సంక్షేమ పథకాలు అందుతున్నాయని మండిపడ్డారు. మహిళా రక్షణ కోసం చంద్రబాబు ఒక సమీక్ష కూడా నిర్వహించలేదని విమర్శించారు.