Koran Royal: లక్ష్మితో భూమన కుమారుడు రూ. 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు: కిరణ్ రాయల్

- కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ ఆరోపణలు
- అది భూమన చేయించిన మనీ ట్రాప్ అన్న కిరణ్ రాయల్
- జిరాక్స్ షాప్ పెట్టుకున్న భూమనకు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్న
జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ రాయల్ స్పందిస్తూ తనపై విష ప్రచారం చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా వంద కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. తనను తప్పుగా చూపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ వస్తే తప్పుడు ప్రచారం చేసేందుకు లక్ష్మితో రూ. 10 కోట్లకు ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు.
జిరాక్స్ షాపు పెట్టుకున్న భూమన కరుణాకర్ రెడ్డికి వందల కోట్లు ఎలా వచ్చాయని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. భూమన కుటుంబాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. లక్ష్మిది హనీ ట్రాప్ కాదని... భూమన కరుణాకర్ రెడ్డి చేయించిన మనీ ట్రాప్ అని అన్నారు. మహిళను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం వీరికే చెల్లిందని చెప్పారు.