: అద్వానీ రాజీనామాపై కాంగ్రెస్ మౌనం
బీజేపీ అగ్రనేత.. దశాబ్దాలుగా తమకు కొరకరానికొయ్యలా పరిణమించిన సీనియర్ రాజకీయవేత్త అద్వానీ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహిస్తోంది. దేశవ్యాప్తంగా అద్వానీ నిర్ణయం సంచలనం సృష్టించినా కాంగ్రెస్ పెదవి విప్పకపోవడం వ్యూహాత్మకమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయమై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేది స్పందించారు. అద్వానీ రాజీనామా బీజేపీ అంతర్గత వ్యవహారమంటూ, అంతకుమించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇక మోడీపై మాత్రం విరుచుకుపడ్డారు ద్వివేది. బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ గా మోడీ నియామకంతోనే ఆ పార్టీ పతనం ఆరంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకు అద్వానీ రాజీనామాయే తార్కాణమని చెప్పారు.