Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన సిఫీ సీఎండీ రాజు వేగేశ్న

- ఏపీలో పెట్టుబడులపై ఇరువురి మధ్య చర్చ
- ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు వివరించిన లోకేశ్
- సానుకూలంగా స్పందించిన రాజు వేగేశ్న
- విశాఖలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు ఆసక్తి
సిఫీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న నేడు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు గురించి చర్చించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా రాజు వేగేశ్న ను మంత్రి నారా లోకేశ్ కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను ఆయనకు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇతర ఐటీ విధానాల గురించి రాజు వేగేశ్నకుతెలిపారు.
నారా లోకేశ్ తో భేటీ సందర్భంగా రాజు వేగేశ్న ఏపీలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశారు. సిఫీ సంస్థ ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.