Shubman Gill: శుభ్‌మ‌న్ గిల్ ఖాతాలో స‌రికొత్త‌ రికార్డు!

Shubman Gill is now the fastest batter to 2500 runs in ODIs

  • అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లండ్, భార‌త్ మూడో వ‌న్డే
  • వ‌న్డేల్లో అత్యంత‌ వేగంగా 2,500 ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా గిల్‌
  • కేవ‌లం 50 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని సాధించిన యువ ఆట‌గాడు
  • అర్ధ శ‌త‌కంతో రాణించిన కోహ్లీ

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వ‌న్డేలో టీమిండియా యువ ఓపెన‌ర్‌ శుభ‌మ‌న్ గిల్ ఖాతాలో స‌రికొత్త రికార్డు చేరింది. వ‌న్డేల్లో అత్యంత‌ వేగంగా 2,500 ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్ లో గిల్ ఈ అరుదైన మైలురాయిని సాధించ‌డం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేస్తున్న భార‌త జ‌ట్టు ప్రారంభంలోనే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ వికెట్ కోల్పోయిన ఆ త‌ర్వాత పుంజుకుంది. ఇటీవ‌ల ఫామ్‌లేక తంటాలు ప‌డుతున్న‌ కోహ్లీ అర్ధ శ‌త‌కం (52) చేశాడు. అలాగే గిల్ ఈ సిరీస్ లో వ‌రుస‌గా మూడో హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. 

గిల్, కోహ్లీ ద్వ‌యం రెండో వికెట్ కు ఏకంగా 116 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పింది.  దీంతో భార‌త్ 23 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌ న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. గిల్ 78, అయ్య‌ర్ 8 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శ‌ర్మ ఒక్క ప‌రుగుకే ఔట‌య్యాడు.

More Telugu News