Chiranjeevi: హాట్‌టాపిక్‌గా మారిన మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు!

- 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరు
- ఇంట్లో 'లేడిస్ హాస్టల్ వార్డెన్' ఫీలవుతానన్న వ్యాఖ్యానించిన చిరంజీవి
- సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన చిరంజీవి వ్యాఖ్యాలు
మా ఇంట్లో ఆడపిల్లలందరినీ చూస్తుంటే.. మా ఇల్లు లేడీస్ హాస్టల్‌లా.. నేను వాళ్లకు వార్డెన్‌లా అనిపిస్తాను. అందుకే రామ్‌చరణ్ మళ్లీ ఆడపిల్లను కంటాడేమో అని భయమేసి.. ఒక మగ పిల్లాడిని కనరా.. మన లెగసీని కంటిన్యూ చేస్తాడు అన్నాను' అన్నారు అగ్ర నటుడు చిరంజీవి నవ్వుతూ. మంగళవారం జరిగిన 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అంతేకాదు, చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది మహిళలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఇలా మాట్లాడటం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. అయితే మెగాస్టార్ ఈ మాటలు కేవలం ఇంట్లో తన మనవరాళ్లతో తన పరిస్థితి గురించి చమత్కారంగా అన్నారే తప్ప ఆయన మహిళలను ఎంతో గౌరవిస్తారని, అది ఆయన అభిప్రాయం కాదని చాలామంది అంటున్నారు.