Rashmika Mandanna: హీరోల గురించి రష్మిక మనసులో మాట

rashmika mandanna on co stars

  • అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందన్న రష్మిక
  • రణ్‌వీర్‌కు, తనకు నాన్సెన్స్ నచ్చదని వ్యాఖ్య
  • విక్కీ కౌశల్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారని కితాబు 

తనతో నటించిన పలువురు హీరోల గురించి హీరోయిన్ రష్మిక తన మనసులోని మాటను బయటపెట్టింది. ఈ నెల 14న విడుదల కానున్న 'ఛావా' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విక్కీ కౌశల్, అల్లు అర్జున్, రణ్‌బీర్ కపూర్‌లతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు.

ఇటీవల తాను చేసిన మూవీల్లోని కథానాయకులు అందరూ ఎంతో మంచి వ్యక్తులని ప్రశంసించారు. స్నేహభావంతో, ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారని కితాబు నిచ్చారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో తన ఎనర్జీ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందన్నారు. ఆయనతో నటించడం ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. 

రణ్‌వీర్‌కు తనకు నాన్సెన్స్ నచ్చదన్నారు. కేవలం పాత్రల గురించి తప్ప ఇతర విషయాలు ఏవీ మాట్లాడుకోమని, అంతా ప్రొఫెషనల్‌గా ఉంటామని తెలిపారు. ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్తే ఆయన అద్భుతమైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని పేర్కొన్నారు. వారితో కలిసి పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రష్మిక అన్నారు. 

  • Loading...

More Telugu News