Kinjarapu Ram Mohan Naidu: 'యశస్' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు... ఫొటోలు ఇవిగో!

Minister Ram Mohan Naidu flies with Yashas Jet Trainer plane in Aero India 2025 air show

  • బెంగళూరులో ఏరో ఇండియా-2025 ఎయిర్ షో
  • హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
  • స్వదేశీ తయారీ యుద్ధ విమానంలో గగన విహారం

బెంగళూరులో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏరో ఇండియా-2025 వైమానిక ప్రదర్శన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు నేడు ఏరో ఇండియా ఎయిర్ షోకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన యుద్ధ విమానాన్ని నడపడం విశేషం. ఈ విషయాన్ని రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఏరో ఇండియా-2025 ఎయిర్ షో లో యుద్ధవిమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. హెచ్ఏఎల్ సంస్థ దేశీయంగా తయారుచేసిన ఈ హెచ్ జేటీ-36 యశస్ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం వచ్చిందని తెలిపారు. 

విమానయాన, రక్షణ రంగంలో నానాటికీ పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు వివరించారు.

  • Loading...

More Telugu News