Telangana: రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటే మీసేవలో అవసరం లేదు: పౌరసరఫరాల శాఖ వర్గాలు

- ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారుల వెల్లడి
- మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను స్వీకరించాలని అధికారుల ఆదేశాలు
- కిటకిటలాడుతున్న మీసేవ కేంద్రాలు
రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, కాబట్టి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ఇదివరకు కూడా తెలిపారు.
మీసేవ కేంద్రాలు కిటకిట
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించడంతో మీసేవ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని మీసేవ అధికారులను పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో సోమవారం సాయంత్రం నుండి స్వీకరిస్తున్నారు. పలు మీసేవ కేంద్రాల్లో ఉదయం నుండే వరుస కట్టారు. సోమవారం రాత్రి నుండి ఈ వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు.