Mynampalli Rohith: రూ.3 కోట్ల విలువైన కారును కొనుగోలు చేసిన తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

- మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ ఎలక్ట్రిక్‌ను కొనుగోలు చేసిన రోహిత్
- డీప్ బ్లాక్ షేడ్ నుండి కొనుగోలు చేసిన ఎమ్మెల్యే
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణం
భారతదేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే అయిన తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సుమారు రూ.3 కోట్ల విలువైన సరికొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. మెర్సిడెజ్ బెంజ్ జీ580 ఈక్యూ ఎలక్ట్రిక్ (Mercedes Benz g580 eq)ను కొనుగోలు చేశారు. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మెర్సిడెజ్ బెంజ్ ఈ కారును విడుదల చేసింది. మైనంపల్లి రోహిత్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మెదక్ నుండి పోటీ చేసి గెలుపొందారు.
మైనంపల్లి రోహిత్ ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయడంతో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ఆయన డీప్ బ్లాక్ షేడ్ ఉన్న ఈ కారును కొనుగోలు చేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు లుక్ జీ-వాగెన్ ఐస్ వెర్షన్‌ను పోలి ఉంటుంది. ఈ ఎస్‌యూవీకి రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం, మరొకటి కారు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కోసం ఉంటాయి. ఇందులో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు ఉంటాయి.
మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హీట్, కూల్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. నాలుగు చక్రాలకు నాలుగు మోటార్లు ఉంటాయి. జీ580 ఈక్యూ 116 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ వేరియంట్‌లో ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. కేవలం 32 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎస్‌యూవీ 0 నుండి 5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. కారు గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. దీని ఎక్స్ షోరూం ధర రూ.3 కోట్లు.