Mukesh Ambani: ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు కుటుంబంతో సహా వచ్చిన ముఖేశ్ అంబానీ

Mukesh Ambani along with family arrives Prayagraj

  • తల్లి, భార్య, పిల్లలతో ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు ముఖేశ్ అంబానీ
  • పడవలో ప్రయాణించిన కుటుంబం
  • సామాజిక మాధ్యమంలో వీడియోలు వైరల్

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబం వచ్చింది. ముఖేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ, భార్య, పిల్లలు ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు హాజరయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన వారు, అక్కడి నుంచి కారులో ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. కుటుంబమంతా కలిసి పడవలో ప్రయాణించారు. త్రివేణి సంగమానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.

కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పుణ్యస్నానాలు ఆచరించారు.

కుంభమేళా ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్న, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. 50 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా పది నుంచి పన్నెండు గంటలు పడుతోంది. త్రివేణి సంగమంలో ఇప్పటి వరకు 44 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News