BrahmaAnandam: ప్రభాస్ విడుదల చేసిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి!

- బ్రహ్మానందం ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'బ్రహ్మా ఆనందం' చిత్రం
- ఎమోషనల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకున్న ట్రైలర్
- ట్రైలర్‌తో సినిమాపై పాజిటివ్ బజ్
కొంత విరామం తరువాత, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బ్రహ్మా ఆనందం'. ఆయన కుమారుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకే... మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల హీరో ప్రభాస్ విడుదల చేశారు.
ట్రైలర్‌ను చూస్తే ఇది ఒక భావోద్వేగభరితమైన చిత్రంగా అనిపిస్తుంది. నాటక కళాకారుడు కావాలనుకునే ఒక యువకుడికి కొంత డబ్బు అవసరం అవుతుంది. అనుకోకుండా ఒక వృద్ధుడు తనకు మనవడిగా ఉంటే ఆరు ఎకరాల పొలం ఇస్తానని చెబుతాడు. అయితే తనతో ఉన్న పది రోజులు తన స్వార్థం కోసమే కాకుండా ఇతరుల మేలు కోసం కూడా ఆలోచించాలనే షరతు పెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంది. భావోద్వేగంతో పాటు వినోదం కూడా ఈ చిత్రంలో జోడించినట్లు కనిపిస్తుంది. మీరు కూడా ఈ ట్రైలర్‌పై ఒక లుక్కేయండి.