KTM: ఒకేసారి మూడు కొత్త అడ్వెంచర్ బైక్ లను తీసుకొచ్చిన కేటీఎమ్

- భారత్ లో బజాజ్ భాగస్వామ్యంతో కేటీఎమ్ కార్యకలాపాలు
- యువతను మరింత ఆకర్షించేలా కొత్త బైకుల డిజైన్
- అధునాతన ఫీచర్లతో అడ్వెంచర్ బైకులు
యువతను ఆకట్టుకునే స్పోర్టీ లుక్, వేగం, ట్రెండీ డిజైన్‌తో కూడిన బైక్‌లకు కేటీఎమ్ ప్రసిద్ధి చెందింది. కేటీఎమ్ అనేది ఆస్ట్రియాకు చెందిన ద్విచక్రవాహన తయారీ సంస్థ. ఈ సంస్థ భారత్ లో బజాజ్ సంస్థతో కలిసి నూతన తరం బైకులను తీసుకువస్తోంది. తాజాగా, కేటీఎమ్ ఒకేసారి మూడు కొత్త అడ్వెంచర్ బైకులు విడుదల చేసింది.
250 అడ్వెంచర్, 390 అడ్వెంచర్, 390 అడ్వెంచర్ ఎక్స్ పేరిట పరిచయం చేస్తున్న ఈ బైకులు యూత్ ను లక్ష్యంగా చేసుకుని రూపొందించినట్టు వాటి డిజైన్ చూస్తేనే అర్థమవుతోంది.
250 అడ్వెంచర్ ధర రూ.2.59 లక్షలు... 390 అడ్వెంచర్ ఎక్స్ ధర రూ.2.91 లక్షలు... 390 అడ్వెంచర్ ధర రూ.3.68 లక్షలు అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.
ఈ మూడు బైకులు ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ పర్పస్ తో రూపొందించిన బైకులే. కొండలు, గుట్టలు, మట్టిరోడ్లపైనా కేటీఎమ్ కొత్త అడ్వెంచర్ బైకులతో దూసుకుపోవచ్చు.
అధునాతనమైన సస్పెన్షన్ సిస్టమ్, కార్నరింగ్ ఏబీఎస్, క్విక్ షిఫ్టర్ ప్లస్, బైక్-రైడ్-బై-వైర్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, 5 అంగుళాల డిస్ ప్లే కన్సోల్, బ్లూటూత్, స్పోక్ వీల్స్ స్థానంలో కాస్ట్ వీల్స్ వంటి ఫీచర్లను ఈ బైకుల్లో చూడొచ్చు.


