Tandel Movie: తగ్గేదేలే అంటున్న 'తండేల్'.. నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతంటే..!

Tandel movies 4 days collections

  • కలెక్షన్లలో దూసుకుపోతున్న 'తండేల్'
  • రూ. 100 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేస్తున్న మూవీ
  • చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా 'తండేల్'

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'తండేల్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... తొలి షోతోనే హిట్ టాక్ ను అందుకుంది. శనివారం, ఆదివారంతో పాటు నిన్న కూడా ఈ సినిమా గట్టిగానే వసూలు చేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ కు చెందిన గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. 

నాలుగు రోజుల్లో 'తండేల్' మూవీ రూ. 73.2 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు నాగచైతన్య, సాయిపల్లవి అద్భుత నటనతో పాటు... దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అసెట్ గా నిలుస్తోంది. చైతూ కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది.

  • Loading...

More Telugu News