Kane Williamson: కోహ్లీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన కేన్ మామ‌.. వ‌న్డేల్లో రెండో ఆట‌గాడిగా న‌యా రికార్డు!

Kane Williamson Leaves Virat Kohli Behind With Momentous Feat In Pakistan

  • పాకిస్థాన్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ‌ధ్య‌ ట్రై సిరీస్
  • నిన్నటి వ‌న్డేలో స‌ఫారీల‌ను చిత్తు చేసిన కివీస్
  • అజేయ శ‌త‌కం (133)తో రాణించిన కేన్ విలియ‌మ్స‌న్ 
  • వ‌న్డేల్లో అత్యంత వేగంగా 7వేల ర‌న్స్ ( 159 ఇన్నింగ్స్‌)  చేసిన రెండో ప్లేయ‌ర్‌గా కేన్  
  • త‌ద్వారా కోహ్లీ రికార్డు (161 ఇన్నింగ్స్‌)ను బ్రేక్ చేసిన కేన్ మామ‌
  • ఫాస్టెస్ట్ 7వేల ర‌న్స్ రికార్డు హ‌షీమ్ ఆమ్లా (150 ఇన్నింగ్స్‌) పేరిట

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్‌, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఆడుతున్నాయి. ఇందులో భాగంగా సోమ‌వారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కివీస్‌, స‌ఫారీల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ వ‌న్డేలో న్యూజిలాండ్ ఘ‌న విజ‌యం సాధించింది. ద‌క్షిణాఫ్రికా నిర్దేశించిన 305 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కివీస్ సునాయాసంగా ఛేదించింది. కేన్ విలియ‌మ్స‌న్ అజేయ శ‌త‌కం (133)తో రాణించాడు. 

ఇక ఈ భారీ ఇన్నింగ్స్ ద్వారా కేన్ మామ మ‌రో రికార్డు కొల్ల‌గొట్టాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 7వేల ప‌రుగులు చేసిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు. కేవ‌లం 159 ఇన్నింగ్సుల్లోనే అత‌డు ఈ ఫీట్ సాధించాడు. త‌ద్వారా టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ రికార్డును కేన్ బ‌ద్ద‌లు కొట్టాడు. కోహ్లీ 7వేల ప‌రుగుల మైలురాయిని చేరుకోవ‌డానికి 161 ఇన్నింగ్సులు ఆడాడు. 

కాగా, ఫాస్టెస్ట్ 7వేల ర‌న్స్ రికార్డు మాత్రం ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హ‌షీమ్ ఆమ్లా పేరిట ఉంది. అత‌డు కేవ‌లం 150 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఈ ముగ్గురి త‌ర్వాత ఏబీ డివిలియ‌ర్స్ (166 ఇన్నింగ్స్) ఉన్నాడు. 

  • Loading...

More Telugu News