The Waking Of A Nation: రామ్ మధ్వాని ‘ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్’ టీజర్ విడుదల

జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకున్న అసలు రహస్యాలు, ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దురాగతాల్ని వెలికి తీసేలా ‘ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్’ అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ సోనీ లివ్‌లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
జాతీయ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ మధ్వాని ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.
జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యానికి వ్యతిరేకంగా పోరాడిన కాంతిలాల్ సాహ్ని అనే న్యాయవాది పాత్రలో తరుక్ రైనా నటించారు. హంటర్ కమిషన్ చరిత్రను వక్రీకరిస్తుండటంతో ఈ కాంతిలాల్ సత్యం కోసం పోరాడుతుంటాడు. మరి అసలు నిజాల్ని కాంతిలాల్ వెలికి తీశాడా? లేదా? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా టీజర్‌ను కట్ చేశారు.
రామ్ మధ్వాని ఫిలింస్ బ్యానర్‌పై రామ్ మధ్వాని, అమిత మధ్వాని నిర్మించిన ఈ సిరీస్‌లో తారక్ రైనా, నికితా దత్తా, సాహిల్ మెహతా, భావషీల్ సింగ్, అలెక్స్ రీస్, పాల్ మెక్‌ఇవాన్ తదితరులు నటించారు. ఈ సిరీస్ కథను శంతను శ్రీవాస్తవ, శత్రుజీత్ నాథ్, రామ్ మధ్వానీ రచించారు.