L2 Empuraan: ఎల్2 ఎంపురాన్ చిత్రం నుంచి బేజాద్ ఖాన్ లుక్ విడుదల

- మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో ఎల్2 ఎంపురాన్
- భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం
- సలాబత్ హంజా పాత్ర పోషిస్తున్న బేజాద్ ఖాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ఎల్2 ఎంపురాన్. ఈ చిత్రానికి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు బేజాద్ ఖాన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బేజాద్ ఖాన్ ఇందులో సలాబత్ హంజా పాత్ర పోషిస్తున్నాడు. ఈ మేరకు చిత్రబృందం క్యారెక్టర్ నెం.33 పేరిట అప్ డేట్ రిలీజ్ చేసింది.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు మంజు వారియర్, టొవినో థామస్ తదితరులు నటిస్తున్నారు. ఎల్2 ఎంపురాన్ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ కు ఎల్2 ఎంపురాన్ సీక్వెల్ అని తెలిసిందే.