Nandamuri Balakrishna: జర్మనీలో 'NBK పద్మభూషణ్' సంబరాలు... వీడియో ఇదిగో!

Fans in Germany celebrates Padma Bhushan for NBK

  • బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం
  • అభిమానుల్లో ఆనందం
  • జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో వేడుకలు

టాలీవుడ్  అగ్ర కథానాయకుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం తెలిసిందే. బాలయ్యకు విశిష్ట అవార్డు లభించడం పట్ల అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా జర్మనీలోనూ సంబరాలు చేసుకున్నారు. 

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో నందమూరి అభిమానుల సంఘం - Nandamuri Fans Germany ఘనంగా 'NBK పద్మ భూషణ్' సంబరాలు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నూరెంబర్గ్, స్టట్ గార్ట్ సహా జర్మనీలోని వివిధ నగరాల నుంచి అభిమానులు హాజరయ్యారు. 

కేంద్ర ప్రభుత్వం నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్భంగా వారు ఆయనకు తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణ ఈ గౌరవాన్ని అందుకోవడం తమకు ఎంతో గర్వకారణమని తెలిపారు. బాలయ్య క్రమశిక్షణ, కృషి, సినీ మరియు సమాజ సేవ రంగాల్లో ఆయన చేసిన విశేషమైన పనులను కొనియాడారు. ఆయన పని తీరును యువత ఆదర్శంగా తీసుకోవాలని, నిరంతరం శ్రమించి ముందుకు సాగాలని సూచించారు.

బాలకృష్ణ ఒక నటుడిగానే కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ విశేషంగా రాణిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో నిర్వహించిన ఈ వేడుక ఎంతో ఉత్సాహభరితంగా సాగి, అభిమానుల హర్షధ్వానాలతో ముగిసింది.

  • Loading...

More Telugu News