Police: పోలీస్ కస్టడీకి మస్తాన్‌సాయి

Police to take Masthansai to their custody

  • యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు
  • మస్తాన్‌సాయిని కస్టడీకి ఇవ్వాలని పోలీసుల పిటిషన్
  • కస్టడీకి అనుమతించిన రాజేంద్రనగర్ కోర్టు

అభ్యంతరకర వీడియోలతో యువతులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్తాన్‌సాయిని పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడినట్లుగా మస్తాన్‌సాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మస్తాన్‌సాయిని తమ కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మస్తాన్‌సాయి రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ప్రస్తుతం అతను జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పోలీసులు ఈ నెల 13న మస్తాన్‌సాయిని తమ కస్టడీకి తీసుకోనున్నారు. మస్తాన్‌సాయిపై గతంలో నార్సింగి, మోకిల పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

రాజ్ తరుణ్, తాను విడిపోవడానికి మస్తాన్‌సాయి కారణమని కొన్ని రోజులకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నారు. పలువురు అమ్మాయిల ప్రైవేటు వీడియోలు కూడా అతని వద్ద ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఇటీవల మస్తాన్‌సాయిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో అతని హార్డ్ డిస్క్‌లో వందలాది మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలను పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News