Dastagiri: దస్తగిరికి జైల్లో బెదిరింపులు... బీటెక్ రవిని ఆరా తీసిన విచారణ అధికారి

Investigative Officer Rahul takes info from BTech Ravi in Dastagiri issue

  • వివేకా కేసులో అప్రూవర్ దస్తగిరికి గతంలో జైల్లో బెదిరింపులు
  • డాక్టర్ చైతన్య రెడ్డిపై ఆరోపణలు
  • విచారణకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం
  • విచారణ కొనసాగిస్తున్న రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి నుంచి బెదిరింపులు ఎదురుకావడం పట్ల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విచారణ అధికారిగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా రాహుల్ కడపలో విచారణ కొనసాగిస్తున్నారు. 

విచారణలో భాగంగా రాహుల్ తాజాగా టీడీపీ నేత బీటెక్ రవిని ఆరా తీశారు. అప్పట్లో కడప జైల్లో దస్తగిరి, బీటెక్ రవి ఎదురెదురు బ్యారక్ ల్లో ఉన్నారు. దస్తగిరి బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా, లేదా? అని బీటెక్ రవిని ప్రశ్నించారు. అందుకు బీటెక్ రవి బదులిస్తూ... దస్తగిరి ఉన్న బ్యారక్ లోకి చైతన్య రెడ్డి వెళ్లడం చూశానని బదులిచ్చారు. చైతన్య రెడ్డి రాకపై ఆరోజే జైలు సిబ్బందిని ప్రశ్నించానని బీటెక్ రవి తెలిపారు. 

కాగా, విచారణ అధికారి రాహుల్ ఇప్పటికే డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ లను విచారించారు. జైలు సిబ్బందిని కూడా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News