Mamta Kulkarni: మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలగిన మమతా కులకర్ణి

Mamta Kulkarni resigns for Maha Mandaleswar

  • ఇటీవల కిన్నార్ అఖాడాలో చేరిన మమతా కులకర్ణి
  • మహామండలేశ్వర్ గా నియామకం
  • తీవ్ర విమర్శలు రావడంతో కీలక నిర్ణయం తీసుకున్న మమతా

బాలీవుడ్ నటి మమతా కులకర్ణి ఇటీవల కిన్నార్ అఖాడాలో చేరడం, ఆమెను మహామండలేశ్వర్ గా నియమించడం తెలిసిందే. అయితే ఇతర అఖాడాలు దీన్ని తప్పుబట్టాయి. పలువురు మత పెద్దలు ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 

మమత నియామకం పట్ల కిన్నార్ అఖాడాలో సైతం భేదాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు అజయ్ దాస్, ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దాంతో లక్ష్మీనారాయణ త్రిఫాఠిపై వేటు పడింది. 

ఈ నేపథ్యంలో, మమతా కులకర్ణి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయినప్పటికీ సాధ్విగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన బాల్యం నుంచి ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. 

మమతా కులకర్ణి గతంలో వేల కోట్ల డ్రగ్స్ కేసులోనూ చిక్కుకోవడం తెలిసిందే. పైగా, ఎలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేకపోయినప్పటికీ, అఖాడాలో చేరిన వెంటనే మహామండలేశ్వర్ పదవిని పొందడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రూ.10 కోట్లు చెల్లించి ఆ పదవిని అందుకున్నారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. 

  • Loading...

More Telugu News