Puli Setha: షాపింగ్ మాల్ నుంచి సినిమాల్లోకి వచ్చాను: పులి సీత

Puli Seetha Interview

  • చిన్నచిన్న ఉద్యోగాలు చేశానన్న పులి సీత 
  • చాలా తక్కువ జీతం వచ్చేదని వెల్లడి
  • నెల్లూరు యాస పుట్టుకతో వచ్చిందని వివరణ  
  • అనుకోకుండా సినిమాలలోకి వచ్చానన్న పులి సీత
   


పులి సీత... అనే పేరు ఇప్పుడు పాప్యులర్. ఆమె గ్లామర్ కీ... నెల్లూరు మాటతీరుకి చాలామంది అభిమానులు ఉన్నారు. ముక్కుసూటిగా... కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడే ఆమె తీరును ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. పెద్దగా చదువుకోకపోయినా అటు రాజకీయాలపై... ఇటు సినిమాపై ఆమెకి మంచి అవగాహన ఉంది. సోషల్ మీడియా ద్వారా ఆమె మరింత పాప్యులర్ అయింది. అలాంటి ఆమె తాజాగా సుమన్ టీవీతో మాట్లాడారు. 

"మాది నెల్లూరు... నేను పుట్టి పెరిగింది అక్కడే. అలాంటిది నేను నెల్లూరు యాసను కాపీ కొట్టానని అంటున్నారు... అదే నాకు నచ్చడం లేదు. హైదరాబాదులో నేను ఒక షాపింగ్ మాల్ లో సేల్స్ గాళ్ గా పనిచేస్తూ ఉండేదానిని. అక్కడికి వచ్చిన ఒక డైరెక్టర్ నన్ను చూశాడు. 'సినిమాల్లో నటించాలనే ఉద్దేశం ఉందా?' అని అడిగాడు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందిగానీ... ఎవరిని కలవాలో తెలియదని చెప్పాను. అతను నాకు బోయపాటి సినిమాను గురించి చెప్పి, వెళ్లి కలవమని చెప్పాడు" అని అన్నారు. 

"సినిమా ఆఫీసుకి వెళ్లి బోయపాటిని కలిశాను. ఆయనకి ఒక డైలాగ్ చెప్పమని అడిగారు... నేను చెప్పాను. ఆ సినిమాలో నన్ను తీసుకున్నారు. రోజుకి 4,500 ఇచ్చారు... మంచి భోజనం పెట్టారు. ఇదేదో బాగుందని చెప్పి... ఇక్కడే కష్టపడాలని అనుకున్నాను. అప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఇంకా ఎక్కువగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ తొమ్మిదేళ్లలో 20కి పైగా సినిమాలు చేశాను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News