Jabilamma Neeku Antha Kopama: ధ‌నుశ్ ద‌ర్శ‌క‌త్వం.. 'జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా' ట్రైల‌ర్ చూశారా?

Jabilamma Neeku Antha Kopama Telugu Trailer Out Now

  • ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో 'జాబిల‌మ్మ నీకు అంత కోప‌మా' మూవీ
  • కీల‌క పాత్ర‌ల్లో పావిశ్‌, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్
  • ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమా విడుద‌ల

త‌మిళ న‌టుడు ధ‌నుశ్‌ హీరోగానే కాకుండా నిర్మాత, ద‌ర్శ‌కుడిగానూ తన ప్రత్యేకతను చాటారు. ఆయన డైరెక్ష‌న్ లో రూపొందిన తాజా చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ చూస్తూంటే ప‌క్కా యూత్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తోంది. 

అలాగే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్లు అర్థ‌మ‌వుతోంది. 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి' అంటూ ధనుశ్‌ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

పావిశ్‌, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రల్లో న‌టించిన ఈ మూవీకి జీవీ ప్ర‌కాశ్ బాణీలు అందించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుద‌ల చేయనున్నారు.

More Telugu News