Tandel Movie Collections: దుమ్మురేపుతున్న 'తండేల్'.. మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే..!

Naga Chaitanya Tandel 3 days collections

  • కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగచైతన్య
  • మూడు రోజుల్లో రూ. 62.37 కోట్ల గ్రాస్  
  • త్వరలో రూ. 100 కోట్ల గ్రాస్ రాబడుతుందని అంచనా  

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన 'తండేల్' సినిమా సూహర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా దూసుకుపోతూ, బాక్సాఫీన్ ను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను రాబడుతోంది. 

ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 21 కోట్లను రాబట్టగా, రెండో రోజు రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. తొలి రెండు రోజుల్లో రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. మూడో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టింది. మూడో రోజుకు రూ. 62.37 కోట్ల గ్రాస్ కు చేరుకుంది. వేరే చిత్రాలు పోటీలో లేకపోవడంతో... 'తండేల్' భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో రూ. 100 కోట్ల గ్రాస్ ను దాటనుంది.

మరోవైపు ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై నాగార్జున స్పందిస్తూ... ఒక తండ్రిగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా ఎంత కష్టపడ్డావో, ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నావో చూస్తూనే ఉన్నానని చైతూని ఉద్దేశించి అన్నారు. 'తండేల్' అనేది కేవలం సినిమా మాత్రమే కాదు... నీ శ్రమకు నిదర్శనం అని చెప్పారు. నిన్ను చూస్తూంటే గర్వంగా ఉంది చైతూ అని అన్నారు.

  • Loading...

More Telugu News