vijay deverakonda: కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ

vijay deverakondas kumbh mela new bald look goes viral

  • క్యాప్ లేకుండా కనిపించిన విజయ్ దేవరకొండ
  • కాషాయ వస్త్ర ధారణలో కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు  
  • సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫోటోలు వైరల్

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు తరలివెళుతున్నారు. ఇప్పటికే సంయుక్త మీనన్, యాంకర్ లాస్య, బింధు మాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్యవంశీ, రాజ్ కుమార్ రావు వంటి పలువురు సినీ ప్రముఖులు కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు చేశారు. 

తాజాగా ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ కాషాయ వస్త్ర ధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు.  ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ ‘VD 12’ కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏడాది నుంచి ఎవరికీ కనిపించకుండా తన హెయిర్‌ని క్యాప్‌తో కవర్ చేస్తూ వస్తున్నాడు. 

ఎంత పెద్ద ఈవెంట్‌కు వెళ్లినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు. తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటి సారి క్యాప్ లేకుండా దర్శనమిచ్చాడు. విజయ్ బోల్డ్ లుక్‌తో బయటి ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. 
.

  • Loading...

More Telugu News