Ram Charan: ఐఎస్పీఎల్ లో తన టీమ్ ను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియంకు వచ్చిన రామ్ చరణ్

భారత్ లో ఇటీవల ఎక్కువ ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ల్లో ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ (ఐఎస్పీఎల్) లీగ్ ఒకటి. ఇది టీ20 క్రికెట్ లీగ్. కాగా, ఈ లీగ్ లో టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఓ టీమ్ ను సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ ఫ్రాంచైజీ పేరు ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్.
ఇవాళ ఫాల్కన్ రైజర్స్... శ్రీనగర్ కే వీర్ జట్టుతో మ్యాచ్ ఆడుతోంది. మహారాష్ట్రలోని థానేలో ఉన్న దాదాజీ కొండదేవ్ స్టేడియంలో ఈ సీజన్-2 లీగ్ మ్యాచ్ జరుగుతోంది. తన టీమ్ ను ఎంకరేజ్ చేసేందుకు రామ్ చరణ్ స్టేడియానికి విచ్చేశారు. రామ్ చరణ్ రాకతో స్టేడియంలో కోలాహలం నెలకొంది. అందరికీ అభివాదం చేస్తూ చరణ్ స్టేడియంలో కలియదిరిగారు. తన టీమ్ తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.
కాగా, నేటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్ రైజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లకు 77 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీనగర్ కే వీర్ జట్టు 2 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.