Kiran Royal: తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్

Kiran Royal complains to police

  • కిరణ్ రాయల్ పై మహిళ సంచలన ఆరోపణలు
  • మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్
  • కిరణ్ రాయల్ ను పార్టీకి దూరంగా ఉంచిన జనసేన హైకమాండ్

జనసేన నేత కిరణ్ రాయల్... ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు మహిళ కిరణ్ రాయల్ పై తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో, కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ అధికారిక కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. 

కాగా, కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలతో దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశానని వివరించారు. 

ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని వెల్లడించారు. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వెల్లడించారు.

Kiran Royal
Police
Janasena
Tirupati
  • Loading...

More Telugu News