Thandel: తండేల్.. ఓ అద్భుతమన్న దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు

Director Raghavendra Rao Praised Naga Chaitanya Latest Movie Thandel

  • చాలా రోజుల తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశానన్న దర్శక దిగ్గజం
  • నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారని మెచ్చుకుంటూ ట్వీట్
  • థాంక్స్ చెబుతూ రీట్వీట్ చేసిన చైతూ

నాగ చైతన్య కొత్త సినిమా 'తండేల్' అద్భుతంగా ఉందని దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రశంసించారు. చాలా రోజుల తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశానని ప్రశంసలు కురిపించారు. ‘చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూశా. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. గీతా ఆర్ట్స్‌కు అభినందనలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక దర్శకుడి సినిమా..!’ అంటూ ట్వీట్ చేశారు. రాఘవేంద్రరావు ప్రశంసలపై చైతూ స్పందిస్తూ.. ‘మీ నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్ సర్’ అంటూ రీట్వీట్ చేశారు.

రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందించిన ‘తండేల్‌’ సినిమాతో చాలా రోజులకు నాగ చైతన్య హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా చైతూనే వెల్లడించారు. హిట్ అనే మాట విని చాలా రోజులు అవుతోందని మీడియా ముందు వ్యాఖ్యానించారు. తండేల్ కథ విషయానికి వస్తే.. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌ నేవీకి చిక్కుతారు. ఆపై రెండేళ్ల పాటు పాక్ జైలులో శిక్ష అనుభవించడం, ఈ సందర్భంగా ఆయా మత్స్యకారుల కుటుంబాలలో చోటుచేసుకునే సంఘటనల ఆధారంగా కథ సాగుతుంది. తోటి మత్స్యకారులను ముందుండి నడిపించే తండేల్ గా రాజు పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. రాజు ప్రేయసి సత్య పాత్రలో సాయి పల్లవి జీవించారు. కొన్ని సన్నివేశాలలో థియేటర్లలోని ప్రేక్షకులు కన్నీరు పెట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News