Arvind Kejriwal: మోదీజీ, మమ్మల్ని ఓడించడం మీకీజన్మలో అసాధ్యం.. కేజ్రీవాల్ పాత వీడియో వైరల్

--
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. స్వయంగా పార్టీ చీఫ్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రచార సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మోదీజీ, మమ్మల్ని ఓడించడం మీకు ఈ జన్మలో సాధ్యం కాదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం మీవల్ల కాదు’ అని అన్నారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ వెనుకబడడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
కొంతమంది నెటిజన్లు ఈ వీడియోకు మీమ్స్ జత చేసి పోస్ట్ చేయడంతో అవి కూడా వైరల్ గా మారాయి. కేజ్రీవాల్ మాట్లాడిన మాటల తర్వాత వీడియోకు మీమ్స్ జతచేశారు. కేజ్రీవాల్ ను రాహుల్ గాంధీ ఆపుతున్నట్లు, మాట్లాడొద్దు, సైలెన్స్ గా ఉండు అన్నట్లు మీమ్స్ యాడ్ చేశారు. ఆప్ ను ఓడించడానికి వచ్చే జన్మ వరకు ఎందుకు ఇప్పుడే ఓడించామంటూ బీజేపీ కార్యకర్తలు ఈ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో సీఎం అతిశీ మినహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు.