Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన బ్యాటింగ్ కోచ్

- టీమిండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్
- మోకాలి నొప్పితో తొలి వన్డేకు కోహ్లీ దూరం
- రేపు రెండో వన్డే
- కోహ్లీ ఫిట్ గా ఉన్నాడన్న సితాంశు కోటక్
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో తొలి వన్డేలో ఆడని సంగతి తెలిసిందే. కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నందున అతడిని తుది జట్టుకు ఎంపిక చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.
రేపు (ఫిబ్రవరి 9) టీమిండియా-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో... కోహ్లీ ఫ్యాన్స్ కు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ శుభవార్త చెప్పాడు. కోహ్లీ మ్యాచ్ ఫిట్ నెస్ తో ఉన్నాడని, ప్రాక్టీసు సెషన్ కు కూడా వచ్చాడని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడాడని వెల్లడించాడు. కోహ్లీ రెండో వన్డేలో బరిలో దిగే అవకాశాలున్నాయని అన్నాడు.
ఇక, కోహ్లీ టీమ్ లోకి వస్తే యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ లలో ఎవరిని జట్టు నుంచి తొలగిస్తారన్న ప్రశ్నకు మాత్రం సితాంశు కోటక్ సమాధానం దాటవేశాడు. ఆ విషయం కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చూసుకుంటారని... దీనిపై తాను మాట్లాడలేనని వెల్లడించాడు.