KTR: రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది: కేటీఆర్

KTR says BRS will win next election

  • త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందన్న కేటీఆర్
  • వికారాబాద్‌లో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా కలిసి పని చేయాలని సూచన
  • కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని విమర్శ

రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) అనుకూలమైన వాతావరణం ఉందని, ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు తిరిగి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాబోయే పది, పదిహేను రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వికారాబాద్‌లో ఆరు జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని, గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఎవరికి టిక్కెట్ ఇచ్చినా పార్టీలోని వారంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, అలా చేయని పక్షంలో నష్టపోయేది మనమేనని ఆయన అన్నారు. లేకుంటే మనమే నష్టపోతామని అన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ నుండి ఎన్నికైన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి సాధించింది శూన్యమని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News