Satya Kumar: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సత్యకుమార్

- బీజేపీ విజయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్న సత్యకుమార్
- మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని వ్యాఖ్య
- అభివృద్ధి, సంక్షేమానికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని ప్రశంస
దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో అఖండ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఏపీ మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ... ఈ విజయం ప్రధాని మోదీ పట్ల ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు.
ఢిల్లీలో ప్రచారం చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని సత్యకుమార్ అన్నారు. కేజ్రీవాల్ ను ఓడించడం ద్వారా... ప్రజాధనాన్ని దోచుకునే వారిని క్షమించబోమని ఢిల్లీ ప్రజలు స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమానికి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని... అవినీతి, అబద్ధాలకు గుణపాఠం నేర్పారని చెప్పారు.