Siddharth: అభిమానుల వల్లే ఆ వ్యాధి బారినపడ్డాను: హీరో సిద్ధార్థ్

Hero Siddharth Shocked By Saying That He Have A Rare Disease

  • ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సిద్ధార్థ్‌
  • ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా డౌన్ 
  • ప‌లు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారి వార్త‌ల్లో నిలిచిన త‌మిళ హీరో
  • తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విష‌యం చెప్పిన సిద్ధార్థ్‌
  • తాను అరుదైన వ్యాధితో బాధ‌ప‌డినట్లు వెల్లడి

త‌మిళ హీరో సిద్ధార్థ్ ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బాయ్ గా మంచి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగానే అల‌రించారు. కానీ, ఆ త‌ర్వాత ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా డౌన్ అయ్యారు. ఆ మ‌ధ్య‌లో ఆయ‌న చేసిన చిత్రాలు వ‌రుస‌గా ప‌రాజ‌యం పాలవడం దీనికి ఒక కార‌ణం అని చెప్పొచ్చు. దాంతో ఒక హిట్ కోసం ప‌రిత‌పించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. కానీ, ఆ హిట్ మాత్రం అత‌నికి అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోయింది. 

ఆ త‌ర్వాత హీరోగా కాకుండా కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో కూడా క‌నిపించారు. 

సిద్ధార్థ్ ప‌లు వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారి వార్త‌ల్లో నిలిచారు. ఇప్పుడు త‌న ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను అరుదైన వ్యాధితో బాధ‌ప‌డిన్న‌ట్లు, దానికి కార‌ణం అభిమానులేన‌ని బాంబ్ పేల్చారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు.  

"నేను ఒక అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నా. ఆ వ్యాధి నాకు అభిమానుల వ‌ల్లే వ‌చ్చింది. చాలా మంది హీరోలు సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్‌డ‌మ్ కోసం పాకులాడుతూ ఉంటారు. నేను అదే చేశాను. కానీ, స్టార్‌డ‌మ్ వ‌చ్చాక నేను నా ఫ్యాన్స్ కార‌ణంగా అరుదైన వ్యాధి బారినప‌డ్డాను. దాంతో స్టార్‌డ‌మ్ వ‌చ్చాక ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో చాలా ఇబ్బందులు ప‌డ్డాను. 

చాలా మంది అభిమానులు న‌న్ను ఫాలో చేసి నాతో మాట్లాడ‌టానికి ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. కానీ, నాకు వారితో మాట్లాడాలంటే భ‌య‌మేసేది. చాలా టెన్ష‌న్ ప‌డేవాడిని. అలా ఎందుకు జ‌రుగుతుంద‌ని ఒక‌సారి ఓ వైద్యుడిని క‌లిశాను. ఆ స‌మ‌యంలో నేను పోస్ట్ ట్ర‌మాటిక్ స్ట్రెస్ డిజాస్ట‌ర్ అనే అరుదైన‌ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది. ఆ వ్యాధి నుంచి కోలుకోవ‌డానికి నాకు ఏకంగా ఏడెనిమిదేళ్లు ప‌ట్టింది" అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు. ఇక ఆయ‌న మాట‌లు విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇలాంటి వ్యాధి కూడా ఉంటుందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 

  • Loading...

More Telugu News