Komatireddy Venkat Reddy: కేటీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్

- బీజేపీని మరోసారి గెలిపిస్తున్న రాహుల్ కి అభినందలు అన్న కేటీఆర్
- పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చారని కోమటిరెడ్డి ఎద్దేవా
- సొంత పార్టీకి సున్నా సీట్లు తెచ్చుకున్న మీకు అభినందనలు అని వ్యాఖ్య
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... బీజేపీని మరోసారి గెలిపిస్తున్నందుకు రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాము కాంగ్రెస్ పార్టీ సమరయోధులమని... తాము ఎప్పుడూ ఓటమిని అంగీకరించబోమని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మాదిరే తాము ఎప్పుడూ పుంజుకుంటామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చి, మీ సొంత పార్టీకి సున్నా సీట్లను తెచ్చుకున్న మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు ఎవరైనా కారకులైతే... అది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.