Raghunandan Rao: ఢిల్లీ ఫలితాలు... రేవంత్, కేటీఆర్ లపై రఘునందన్ రావు తీవ్ర విమర్శలు

- ఢిల్లీ ఫలితాలు రేవంత్ రెడ్డికి గుణపాఠమన్న రఘునందన్ రావు
- ఢిల్లీ ఎన్నికలతో కేటీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్న
- తెలంగాణలో బీజేపీ దమ్ము ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుందని వ్యాఖ్య
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద గుణపాఠమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ దమ్ము ఏంటో తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిద గుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఢిల్లీ ఎన్నికలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏం సంబంధమని రఘునందన్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఉంటే ఆ పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని చెప్పారు.
కేటీఆర్ కు అంత దమ్ముంటే 76 అసెంబ్లీ, 12 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా లేనోళ్లు మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలని అన్నారు.