BJP: 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు... తెలంగాణలోనూ విజయం సాధిస్తాం: కిషన్ రెడ్డి

Kishan Reddy on Delhi Assembly results

  • కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా
  • ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందన్న కేంద్రమంత్రి
  • ఈ గెలుపుతో దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి ఊపు లభిస్తుందని వ్యాఖ్య

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతోందని, రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు ఇరవై సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఫలితాలపై కిషన్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో సాధించిన ఈ విజయం దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి మంచి ఊపునిచ్చే పరిణామం అని ఆయన అభివర్ణించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, వారిని అవమానిస్తోందని విమర్శించారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

BJP
G. Kishan Reddy
Telangana
New Delhi
  • Loading...

More Telugu News