Parvesh Verma: అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ.. కాబోయే సీఎం వర్మ?

- ఢిల్లీలో ఘన విజయం దిశగా బీజేపీ
- 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో అధికారాన్ని కైవసం చేసుకోబోతున్న బీజేపీ
- కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మకు సీఎం అయ్యే ఛాన్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో... దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ 27 ఏళ్ల కల ఈరోజు నెరవేరబోతోంది. మరోవైపు, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. సీఎం రేసులో కొన్ని పేర్లు వినిపించినప్పటికీ... చివరిగా పర్వేశ్ వర్మ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత కేజ్రీవాల్ ను పర్వేశ్ వర్మ మట్టి కరిపించారు. దీంతో, ఆయన పేరు బీజేపీ శ్రేణుల్లో మారుమోగుతోంది. కాసేపటి క్రితం అమిత్ షా నుంచి ఆయనకు పిలుపు వెళ్లడంతో... తన నివాసం నుంచి ఆయన అమిత్ షా నివాసానికి వెళ్లారు. అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. సీఎం పదవిపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఈ భేటీ నేపథ్యంలో సీఎం పదవికి పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారయినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.