Mastan Sai: మస్తాన్ సాయి కేసు.. వెలుగులోకి ఏపీ పోలీసు అధికారి రాస లీలలు

- అదనపు ఎస్పీ స్థాయిలో గతంలో ఏపీలో పనిచేసిన అధికారి
- వీడియోల్లో సినీ నటుడు నిఖిల్ కూడా
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మస్తాన్ సాయి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన అధికారి ఒకరు ఓ యువతితో ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అదే యువతి మరో నిందితుడు శేఖర్ బాషాతోనూ ఉంది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, మరో వీడియోలో సినీ నటుడు నిఖిల్ కూడా ఉండటం గమనార్హం.
యువతులను ట్రాప్ చేసి వారి నగ్న వీడియోలను చిత్రీకరించిన తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటూ మన్నేపల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరుకు చెందిన మస్తాన్ సాయిని ఈ నెల 3న నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మస్తాన్ సాయి గురించి వెలుగులోకి వచ్చిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. అతడి హార్డ్ డిస్క్‌లో దాదాపు 200 మంది అమ్మాయిల నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో ఓ పోలీసు అధికారి ఫొటోలు కూడా ఇప్పుడు కనిపించడం సంచలనమైంది. ఆ ఫొటోల్లో ఉన్న అధికారి గతంలో ఏపీలోని ఓ జిల్లాలో అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసినట్టు సమాచారం.
ఓ కేసులో 2022లో ఆ యువతి ఆ పోలీసు అధికారిని కలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చాటింగ్, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో కానీ, ఆయన తనను మోసం చేశారంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సాయం చేస్తానని ఆమెతో శేఖర్‌బాషా పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఈ కేసులో డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న అందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు.