Fire Accident: తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలో వరుస అగ్నిప్రమాదాలపై దర్యాప్తు!

- రెండ్రోజుల కిందట తాడేపల్లిలో అగ్నిప్రమాదాలు
- మధ్యాహ్నం ఓసారి, రాత్రి మరోసారి అగ్నిప్రమాదాలు
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం సమీపంలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. రెండ్రోజుల కిందట మధ్యాహ్నం 3 గంటలకు ఒకసారి... అదే రోజు రాత్రి 8 గంటలకు మరోసారి అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
జగన్ నివాసం సమీపంలో ఈ అగ్నిప్రమాదాలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. తాజాగా, ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు.