Narendra Modi: ఈ నెల 10 నుంచి ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన

PM Modi to visit France and US from Feb 10 to 19

  • ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు మోదీ విదేశీ పర్యటన
  • 12 వరకు ఫ్రాన్స్‌లో పర్యటించనున్న మోదీ
  • 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 10వ తేదీ నుంచి ఫ్రాన్స్, అమెరికాల దేశాలలో పర్యటించనున్నారు. ఆయన విదేశీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12వ తేదీ నుండి 13వ తేదీ వరకు అమెరికాలో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.

ప్యారిస్‌లో జరిగే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్‌కు బయలుదేరతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిసి ఏఐ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత అక్కడి న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధానమంత్రి పరిశీలిస్తారని విక్రమ్ మిస్రీ తెలిపారు.

12వ తేదీ సాయంత్రం ఆయన ఫ్రాన్స్ నుండి బయలుదేరి వాషింగ్టన్ చేరుకుంటారు. 13వ తేదీ ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారని సమాచారం. ఈ సందర్భంగా పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది.

  • Loading...

More Telugu News