Tirumala: తిరుమల అతిథిగృహంలో దంపతుల బలవన్మరణం

- తిరుమలలోని నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య
- చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న శ్రీనివాసులు నాయుడు, అరుణ
- మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమల కొండపై దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. తిరుమలలోని నందకం అతిథిగృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గెస్ట్‌హౌస్‌లోని రూమ్ నం. 203లో తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన భర్త శ్రీనివాసులు నాయుడు, భార్య అరుణ చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.
ఈ దంపతులు నిన్న ఉదయం రూమ్ తీసుకున్నారు. అయితే, వారు రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టీటీడీ సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూశారు. దాంతో వారు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కాగా, శ్రీనివాసులు దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.