Arvind Kejriwal: ఢిల్లీలో హైడ్రామా... కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు

ACB officials rushed to Kejriwal residence

  • రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఫలితాలకు ముందే తమ అభ్యర్థులను కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేజ్రీ
  • బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం
  • ఏసీబీ విచారణకు ఆదేశించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ పీఠం ఎవరిదో రేపటితో తేలనుండగా... నేడు హైడ్రామా నెలకొంది. ఫలితాలకు ముందే ఆప్ అభ్యర్థులను కొనేందుకు బీజేపీ యత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించడం... కేజ్రీ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించి ఏసీబీ విచారణకు ఆదేశించడం హస్తిన రాజకీయాల్లో కాకపుట్టించింది. 

ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. అయితే, ఏసీబీ అధికారుల బృందాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

ఇవాళ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 70 మంది ఆప్ అభ్యర్థులు, పార్టీ నేతలు కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికి ఏసీబీ అధికారులు రావడంతో, కేజ్రీ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  

ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికలు జరగ్గా... రేపు (ఫిబ్రవరి 8) ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News