AP Assembly Session: ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... 28న బడ్జెట్!

AP Assembly Budget Sessions will be start from Feb 24

  • ఈసారి 15 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
  • ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • సభకు పూర్తి సబ్జెక్టుతో సిద్ధమై రావాలని మంత్రులకు చంద్రబాబు సూచన

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తెరలేవనుంది. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. 

ఈసారి అసెంబ్లీ సమావేశాలను మొత్తం 15 పని దినాల పాటు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ జరిగే రోజుల సంఖ్యపై స్పష్టత రానుంది. 

ఇక, ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో సిద్ధమై రావాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.

AP Assembly Session
Budget
TDP-JanaSena-BJP Alliance
YSRCP
  • Loading...

More Telugu News