Spcice Jet: విజయ్ దేవరకొండ సహా ప్రముఖులు ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం... టేకాఫ్ కాని స్పైస్ జెట్ ప్లేన్

- శంషాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానం
- ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతిక లోపం
- విమానంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండతో సహా పలువురు ప్రముఖులు ప్రయాణించాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది శంషాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాలేదు. దీంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు రూ.30 వేలు వెచ్చించి టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ విమానం టేకాఫ్ కాకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్పైస్ జెట్ విమానం శంషాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సి ఉండగా, ఉదయం 9 గంటలకు టేకాఫ్ కావాల్సిన విమానం సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది. ఈ విమానంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు.