USA: అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న తెలుగు విద్యార్థి

Telugu student suicide in USA

  • న్యూయార్క్ లో చదువుకుంటున్న సాయికుమార్ రెడ్డి
  • ఫోన్ లాక్ చేసి ఉండటంతో సాయి తల్లిదండ్రులకు విషయం చెప్పలేకపోతున్న స్నేహితులు
  • మీడియాకు విషయాన్ని తెలియజేసిన స్నేహితులు

అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయి ఆత్మహత్యతో అతని మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియదు. సాయి ఫోన్ లాక్ చేసి ఉండటంతో... కుటుంబ సభ్యులకు ఎలా తెలియజేయాలో తెలియక మీడియాకు సమాచారం అందించారు. 

సాయికుమార్ రెడ్డి ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. 

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. పార్ట్ టైమ్ జాబ్ చేసే వారి పరిస్థితి దయనీయంగా మారింది. పార్ట్ టైమ్ జాబ్స్ లేకపోవడం... ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాల్సి రావడంతో తెలుగు విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి తట్టుకోలేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 

  • Loading...

More Telugu News