Ram Gopal Varma: పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ

- కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో ఆర్‌జీవీని విచారించనున్న పోలీసులు
- ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన ఆర్‌జీవీ
- న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ
కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఆర్‌జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ జరగనుంది.
కాగా, పోలీసుల విచారణకు హాజరు కావడానికి ముందు రామ్ గోపాల్ వర్మను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలోని ఓ హోటల్‌లో వీరిద్దరూ కలిసి మంతనాలు జరిపారు.