Chandrababu: చంద్రబాబును కలిసిన సినీ సంగీత దర్శకుడు థమన్.. అభినందించిన సీఎం

SS Thaman meets Chandrababu

  • విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్
  • తలసేమియా బాధితుల సహాయార్థం థమన్ మ్యూజికల్ నైట్
  • థమన్ ను అభినందించిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ కలిశారు. వీరితో పాటు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా థమన్ కు చంద్రబాబు శాలువా కప్పి, పుష్టగుచ్ఛం అందించి సత్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో థమన్ షేర్ చేశారు. విజనరీ నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసిన ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు.

తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో థమన్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. ఫండ్ రైజింగ్ కోసం నిర్వహిస్తున్న ఈ మ్యూజికల్ నైట్ కోసం తమన్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి సేవా థృక్పథంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును థమన్ కలిశారు. థమన్ చేస్తున్న మంచి పనికి ఆయనను చంద్రబాబు అభినందించారు.

  • Loading...

More Telugu News